సీఎం విజయ్‌కి Z+ సెక్యురిటీ

by Ajay Maddhiboyina |   (  Updated:2026-05-11 12:44:47  IST  )

త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ జోసెఫ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ సెక్యురిటీ కేటాయించింది. 55 మంది కేంద్ర భద్రతా సిబ్బందితో 24 గంటల భద్రత ఏర్పాటు చేసింది.

సీఎం విజయ్‌కి Z+ సెక్యురిటీ
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌మిళ‌నాడు సీఎం విజ‌య్ జోసెఫ్‌కు కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ సెక్యురిటీ కేటాయించింది. 55 మంది కేంద్ర భద్రతా సిబ్బందితో 24 గంటల భద్రత ఏర్పాటు చేసింది. సీఎం భద్రతా బృందంలో 10 మందికి పైగా ఎన్ఎస్జీ క‌మాండోలు ఉన్నారు. సాధార‌ణంగానే సీఎం అయ్యాక విజ‌య్ కి భ‌ద్ర‌త క‌ల్పించ‌గా కేంద్రం భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేసింది. తాజాగా మాజీ సీఎం ఎంకే స్టాలిన్ ను క‌లిసేందుకు ఆయ‌న నివాసానికి చేరుకున్న విజ‌య్ జెడ్ ప్ల‌స్ సెక్యురిటీతోనే క‌నిపించారు. విజ‌య్ కి మాజీ డిప్యూటీ సీఎం ఉద‌య‌నిధి స్టాలిన్ స్వాగ‌తం ప‌లికి లోప‌లికి ఆహ్వానించారు. ముఖ్యమంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర‌వాత స్టాలిన్ తో విజ‌య్ భేటీ అవ్వ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డంతో ఇద్ద‌రూ ఏ అంశాల‌పై చ‌ర్చిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒక‌రిపై మ‌రొక‌రు మాట‌ల తూటాల‌తో దాడి చేసుకోగా ఇప్పుడు ఇద్ద‌రూ క‌ల‌వ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మ‌రోవైపు వీరిద్ద‌రి క‌లయిక రాజ‌కీయాల్లో స్నేహ‌పూర్వ‌క వాతావ‌ర‌ణాన్ని ప్రేరేపించేలా కనిపిస్తోంది.

ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి కలిసిన సీఎం విజయ్

Next Story