- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంకే స్టాలిన్ ఇంటికి వెళ్లి కలిసిన సీఎం విజయ్
తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం స్టాలిన్‌ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. విజయ్ కి ఉదయనిధి స్టాలిన్ స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానించారు. అనంతరం స్టాలిన్ ను కలిసిన తరవాత విజయ్ కి శాలువాకప్పి సత్కరించారు.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్, మాజీ సీఎం స్టాలిన్‌ను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. విజయ్ కి ఉదయనిధి స్టాలిన్ స్వాగతం పలికి ఇంట్లోకి ఆహ్వానించారు. అనంతరం స్టాలిన్ ను కలిసిన తరవాత విజయ్ కి శాలువాకప్పి సత్కరించారు. కేవలం 5 నిమిషాల్లోనే స్టాలిన్, విజయ్ సమావేశం ముగిసింది. కేవలం డీఎంకే నేతలనే కాకుండా ఎండీఎంకే నేతలతోనే కాకుండా ఎండీఎంకే నేతలతోనూ విజయ్ సమావేశం అవుతున్నారు. మరికొద్దిసేపట్లో విజయ్ ఎండీఎంకే నేత వైకో ఇంటికి వెళ్లనున్నారు. సీఎంగా ఎన్నికైన తరవాత ప్రతిపక్ష నేతలతో కేవలం మర్యాదపూర్వకంగా విజయ్ భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఈ వరుస భేటీలు రాజకీయాల్లో స్నేహభావాన్ని ప్రతిబింబించే విధంగా ఉన్నాయని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. ఓడిన నేతలను కలవడంతో విజయ్ మరో మెట్టు ఎక్కాడని ఆయన అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉంటే విజయ్ తమిళనాట జరిగిన ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో విజయ్ పార్టీ టీవీకే 108 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మరో 11 సీట్ల కోసం విజయ్ ఇతర పార్టీల మద్దతు తీసుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటన్నింటిని ఎదుర్కొంటూ చివరికి విజయ్ సీఎంగా ప్రామాణస్వీకారం చేశారు. మరి ముందు ముందు విజయ్ పాలన ఎలా ఉంటుందో చూడాలి.






