Ahmedabad Plane Crash : ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం భూపేంద్ర పటేల్

by Muthe.Rajitha |   (  Updated:2025-06-12 11:51:01  IST  )

గుజరాత్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)లోని క్షతగాత్రులను గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్(CM Bhupendra Patel) పరామర్శించారు.

Ahmedabad Plane Crash : ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం భూపేంద్ర పటేల్
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)లోని క్షతగాత్రులను గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్(CM Bhupendra Patel) పరామర్శించారు. సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను, వారి కుటుంబాలను కలిసి మాట్లాడారు. పూర్తిగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం భూపేంద్ర పటేల్ కీలక వినతి చేశారు. గాయపడిన వారి సంఖ్య భారీగా ఉందని, వారికి రక్తం అత్యవసరమని, పెద్ద ఎత్తున ప్రజలు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ వెళ్తున్న ఎయిర్‌ఇండియా(Air India Flight Crash)కు చెందిన AI 171 బోయింగ్ విమానం టేకాఫ్‌ అయిన వెంటనే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్, మరో రెండు భారీ భవనాలపై కుప్పకూలింది.

ఈ విమానంలో 12 మంది సిబ్బంది సహా 242మంది ప్రయాణికులు ఉన్నారు. విమాన ప్రమాద సమయంలో 169 మంది భారతీయులు, 53మంది బ్రిటన్ వాసులు, ఒక కెనడియన్‌, ఏడుగురు పోర్చుగల్ వాసులు, ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు ఫ్లైట్ లో ఉన్నారు. ప్రమాదస్థలి భీతావాహం ఉంది. కాగా ఈ ప్రమాదంలో 150 మందికి పైగా మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మరోవైపు మెడికల్ కాలేజీకి చెందిన 20 మంది మెడికోలు కూడా దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.



Also Read: గుజరాత్‌లో విమాన ప్రమాదం.. రాష్ట్ర సీఎంకు కేంద్ర హోం మంత్రి ఫోన్

Next Story