- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుజరాత్‌లో విమాన ప్రమాదం.. రాష్ట్ర సీఎంకు కేంద్ర హోం మంత్రి ఫోన్
గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లో లోని అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 242 మంది ప్రయాణికులతో లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం..

దిశ, వెబ్ డెస్క్: గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లో లోని అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం (plane crash) చోటు చేసుకుంది. 242 మంది ప్రయాణికులతో లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం.. ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే మేఘానిలో సివిల్ ఆస్పత్రి సమీపంలో జనావాసాలపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా మంటలు అలుముకోవడంతో.. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. అలాగే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ విమాన ప్రమాదం గురించి తెలుసుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) గుజరాత్ ముఖ్యమంత్రి, హోం మంత్రి, పోలీసు కమిషనర్‌తో మాట్లాడారు.
ప్రమాదానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని, బాధితులకు కేంద్ర ప్రభుత్వ సహాయం ద్వారా పూర్తి అందిస్తామని అమిత్ షా.. సీఎంకు హామీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతుండగా.. పూర్తి వివరాలు మాత్రం అధికారిక ప్రకటన తర్వాత బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ ఘటనకు సంబంధించిన విడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విమానం కూలి పోయిన వెంటనే పెద్ద ఎత్తున దట్టమైన పొగ కమ్ముకోవడంతో కిలోమీటర్ల మేర.. దీని ప్రభావం కనిపించింది.






