BREAKING: ఓటర్లకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక పిలుపు

by Satheesh |
BREAKING: ఓటర్లకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ కీలక పిలుపు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో ఈ సారి లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటి వరకు విజయవంతంగా ఐదు దశలు కంప్లీట్ అయ్యాయి. ఇవాళ (శనివారం) సిక్త్స్ ఫేజ్ ఎలక్షన్స్ జరగుతున్నాయి. ఆరో విడతలో భాగంగా దేశంలోని 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సామాన్య ఓటర్లతో పాటు సెలబ్రెటీలు, సినీ, రాజకీయ ప్రముఖులు పోలింగ్ బూత్‌లకు క్యూ కడుతున్నారు. ఇందులో భాగంగానే సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ బూత్‌లో సీజేఐ ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓటు వేసి పౌరుడిగా నా బాధ్యతను నేరవేర్చానని అన్నారు. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమైన ఓటు హక్కును ప్రతి ఒక్క ఓటరు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed