- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vijay Sharma: మావోయిస్టు అగ్రనేత పాపారావుతో స్వయంగా మాట్లాడాను: ఆయనలో మార్పు కనిపించింది!
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత కీలకమైన మావోయిస్టు నేత పాపారావు తన బృందంతో కలిసి జనజీవన స్రవంతిలో చేరడం ఒక మైలురాయి వంటిదని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ పేర్కొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో అత్యంత కీలకమైన మావోయిస్టు నేత పాపారావు తన బృందంతో కలిసి జనజీవన స్రవంతిలో చేరడం ఒక మైలురాయి వంటిదని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పాపారావు గత మూడున్నర దశాబ్దాలుగా అడవుల్లో క్రియాశీలంగా ఉంటూ అనేక ఎన్‌కౌంటర్ల నుండి తప్పించుకున్నాడని, అతనిపై సుమారు 25 లక్షల రూపాయల బహుమతి కూడా ఉందని విజయ్ శర్మ తెలిపారు. పాపారావుతో తాను వ్యక్తిగతంగా ఫోన్‌లో మాట్లాడానని, అతనిలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆయన తెలిపారు. పాపారావు లొంగుబాటుతో ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఇకపై DKZSC (Dandakaranya Special Zonal Committee) స్థాయికి చెందిన అగ్రశ్రేణి నక్సలైట్లు ఎవరూ లేరని స్పష్టమైందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఉన్న కొద్దిపాటి నక్సలైట్లు కూడా ఇప్పటికే తమ ఆయుధాలను వదిలేసి ఎక్కడో ఒకచోట స్థిరపడిపోయి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రికార్డుల ప్రకారం సాయుధ నక్సలైట్ల సంఖ్య కేవలం 40 నుండి 45 వరకు మాత్రమే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. రాబోయే ఏడు రోజుల్లో మరికొందరు నక్సలైట్లు కూడా ప్రధాన స్రవంతిలో చేరే అవకాశం ఉందని ఆ






