- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం.. అన్నా డీఎంకే ఎమ్మెల్యేల మధ్య గొడవ
తమిళనాడు అసెంబ్లీలో పొలిటికల్ హైడ్రామా నెలకొంది. సభ నుంచి అన్నాడీఎంకే వాకౌట్ చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు అసెంబ్లీలో పొలిటికల్ హైడ్రామా గందరగోళానికి దారి తీసింది. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే విషయంలో అన్నా డీఎంకే పార్టీలో ఏర్పడిన విభేదాలు సంచలనంగా మారాయి. ఇవాళ సభలో అన్నాడీఎంకే చీఫ్ పళని స్వామి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో విభేదాలు ఉన్నాయని, మా ఎమ్మెల్యేలను సీఎం విజయ్ కలవడం మంచిది కాదని పళనిస్వామి అన్నారు. మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎం చెప్పిన పారదర్శకత ఇదేనా అని ప్రశ్నించారు. పళని స్వామి మాట్లాడాక రెబల్ ఎమ్మెల్యేల తరఫున మాట్లాడేందుకు వేలుమణి ప్రయత్నించారు. ఇందుకు స్పీకర్ అనుమతి ఇవ్వడంతో వేలుమణి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు పళనిస్వామి వర్గం అడ్డుకుంది. పళనిస్వామి వర్గం వర్సెస్ రెబల్ వర్గం మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో పళనిస్వామి వర్గం సభ నుంచి వాకౌట్ చేసింది. పళనిస్వామి వ్యాఖ్యలకు అసెంబ్లీలోనే వేలుమణి కౌంటర్ ఇచ్చారు. తమకు ఎవరూ డబ్బులు ఎరవేయలేదని విజయ్ ప్రభుత్వానికి ప్రజా మద్దతు ఉందన్నారు.






