- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదేమీ చిన్న విషయం కాదు.. సమయం పడుతుంది: ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తుపై కేంద్రం క్లారిటీ
అహ్మదాబాద్ ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమాన ప్రమాద దర్యాప్తులో ఎలాంటి జాప్యం జరగడంలేదని, నిబంధనల ప్రకారమే విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అహ్మదాబాద్ ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్‌లైనర్ (AI-171) విమాన ప్రమాద దర్యాప్తులో ఎలాంటి జాప్యం జరగడంలేదని, నిబంధనల ప్రకారమే విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఇటువంటి పెద్ద విమాన ప్రమాదాల దర్యాప్తులో అనేక సాంకేతిక అంశాలు ముడిపడి ఉంటాయని, అందుకే తుది నివేదిక సమర్పించడానికి తగిన గడువు చెప్పలేమని రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించింది.
దర్యాప్తు పురోగతి.. సాంకేతిక పరిశీలన
ప్రమాదానికి దారితీసిన అన్ని సాధ్యమైన కారణాలను విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB) క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం విమానానికి చెందిన ‘థ్రస్ట్ కంట్రోల్ మోడ్యూల్’ను ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యానుఫ్యాక్చరర్ (OEM) వద్ద తనిఖీ చేస్తున్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ (ICAO) నిబంధనల ప్రకారం జూలై 12, 2025 న ప్రాథమిక నివేదికను, జూన్ 12, 2026న తాత్కాలిక ప్రకటనను AAIB తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గత ఏడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన 35 సెకన్లలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మంది, నేలపై ఉన్న 19 మంది కలిపి మొత్తం 260 మంది మరణించగా, ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు.
తొందరపాటు ముగింపులొద్దు
ఇరు ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్ల ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించినప్పటికీ, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లోని వివరాల ఆధారంగా లోతైన విచారణ జరుగుతోందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పూర్తిస్థాయి తుది నివేదిక వచ్చే వరకు ఎలాంటి ముగింపులకు రాకూడదని విజ్ఞప్తి చేశారు. దర్యాప్తు పూర్తయిన వెంటనే తుది నివేదికను బహిర్గతం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.






