రూ.270 కోట్ల రోడ్డు విస్తరణ పనులపై అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష

by Taduka Kalyani |

కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.270 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

రూ.270 కోట్ల రోడ్డు విస్తరణ పనులపై అధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష
X

దిశ, దుండిగల్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రూ.270 కోట్ల వ్యయంతో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోమవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దకాలంగా అటవీ శాఖ అనుమతులు లభించక రోడ్డు విస్తరణ పనులు నిలిచిపోయాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అవసరమైన అనుమతులు పొందేలా చర్యలు తీసుకుని, రూ.140 కోట్లతో గండిమైసమ్మ–మియాపూర్ రహదారి, రూ.130 కోట్లతో బహదూరపల్లి–దూలపల్లి రహదారి విస్తరణ పనులను ప్రారంభించినట్లు వెల్లడించారు. అనంతరం సంబంధిత అధికారులతో కలిసి రెండు రహదారి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి, పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, కూన శ్రీశైలం గౌడ్, జిల్లా కలెక్టర్ మను చౌదరి, సీఎంసీ కమిషనర్ శ్రీజన, దుండిగల్ డీసీ డాక్టర్ వెంకట మణి కరణ్, తహసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు హనుమంత్ రెడ్డి, భూపతి రెడ్డి, బొంగునూరి కిషోర్ రెడ్డి, బొంగునూరు శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Next Story