ఆర్మూర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఏడుగురి అరెస్ట్..

by Kodari Anjali |

ఆర్మూర్‌లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఏడుగురు పట్టుబడ్డారు.

ఆర్మూర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఏడుగురి అరెస్ట్..
X

దిశ, ఆర్మూర్: ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ నిర్వహించ గా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్య నారాయణ గౌడ్ సోమవారం తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో కట్టుబడిన ఏడుగురిని ఆర్మూర్ కోర్టులో హాజరు పరచగా ఆరుగురికి ఒక్కొక్కరికి 10 వేల చొప్పున మొత్తం 60 వేల రూపాయల జరిమానాను, మరొక ఒక వ్యక్తికి నాలుగు రోజుల సాధారణ జైలు శిక్షను సెకండ్ క్లాస్ ఆర్మూర్ మేజిస్ట్రేట్ గట్టు గంగాధర్ విధించినట్లు ఆర్మూర్ ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. వాహనదారులు వారి వాహనాలను మద్యం సేవించి నడపరాదని, వాహనదారులకు మోటార్ వెహికల నూతన చట్ట ప్రకారం భారీగా జరిమానాలు, జైలు శిక్షలు పెంచడం జరిగిందని, ఆర్మూర్ పట్టణం నందు దుకాణ యజమాను దారులు తమ దుకాణాలను నిర్మిత సమయంలోపు మూసివేయాలని ఆలస్యమైతే ఈ దుకాణదారులకు కూడా జరిమానాలు, జైలు శిక్షలు విధించడం జరుగుతుందని, తల్లిదండ్రులు వారి పిల్లలకు బైక్ వాహనములను నడుపుటకు బైక్లు, ఇతర ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ వివరించారు.

Next Story