ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సెల్‌టవర్ ఎక్కిన వ్యక్తి

by Kodari Anjali |

ప్రభుత్వం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు.

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సెల్‌టవర్ ఎక్కిన వ్యక్తి
X

దిశ, మిర్యాలగూడ రూరల్: ప్రభుత్వం తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి సెల్‌టవర్ ఎక్కి హల్‌చల్ చేసిన ఘటన మిర్యాలగూడ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన షేక్ యూనుస్ జియో సెల్‌టవర్ ఎక్కి తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, షేక్ యూనుస్‌తో మాట్లాడి నచ్చజెప్పారు. అనంతరం అతడిని సురక్షితంగా సెల్‌టవర్‌ నుంచి కిందికి దించారు. అనంతరం షేక్ యూనుస్‌ను విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.

Next Story