- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Instagram: భారత్‌లో ‘ఇన్‌స్టాగ్రామ్’ బ్యాన్? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్ బ్యాన్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటనను విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram)ను త్వరలోనే నిషేధించబోతోందంటూ సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వార్తపై తాజాగా కేంద్ర ప్రభుత్వం (Govt. of India) రియాక్ట్ అయింది. ఆగస్టు 25 నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ను శాశ్వతంగా బ్యాన్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, సత్యదూరమని స్పష్టం చేసింది. మరోవైపు ఇన్‌స్ట్రాగ్రామ్ బ్యాన్‌పై కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) విభాగం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ను బ్యాన్ చేసే ఆలోచన గానీ, ఎలాంటి నిర్ణయం గానీ ప్రభుత్వం తీసుకోలేదని తెలిపింది.
ఆధారం లేని పుకార్లు..
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న పీఐబీ పేరుతో ఉన్న ఫోటోలు, స్క్రీన్ షాట్లు అన్నీ ఎడిట్ చేసినవని, ప్రజలు, నెటిజన్లు ఇలాంటి వార్తలను నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సోషల్ మీడియాలో వచ్చే అర్థం లేని తప్పుడు ప్రచారాలను అస్సలు షేర్ చేయవద్దని, కేవలం ప్రభుత్వ అధికారిక మీడియా ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని కోరింది.






