- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యుత్ అంతరాయాల ఫిర్యాదులను పరిష్కరించాలి : ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి
విద్యుత్ అంతరాయాలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు.

దిశ, నర్సాపూర్: విద్యుత్ అంతరాయాలపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల్లో నెలకొన్న విద్యుత్ సరఫరా సమస్యలు, ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరు, పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా అందించాలని అధికారులను ఆదేశించారు.
అంతేకాకుండా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడం, శిథిలావస్థకు చేరిన పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు ఏర్పాటు చేయడం వంటి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏవైనా విద్యుత్ సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, వీలైనంత వరకు వాటి పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్‌ఈ నారాయణ నాయక్, డీఈ ఈశ్వరస్వామి, తూప్రాన్ డీఈ గరత్మంతు రాజు, నర్సాపూర్ ఏడీఈ రాఘవేందర్ రావు, తూప్రాన్ ఏడీఈ శ్రీనివాస్, ఏఈ రామ్మూర్తి, ఇతర మండలాల ఏఈలు, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.






