ఇంకుడు గుంతలపై అవగాహన కలిగి ఉండాలి..

by Kodari Anjali |

ఇంకుడు గుంతల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగి ఉండాలని తాజ్ పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోషా శ్రీనివాస్ అన్నారు.

ఇంకుడు గుంతలపై అవగాహన కలిగి ఉండాలి..
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్: ఇంకుడు గుంతల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగి ఉండాలని తాజ్ పూర్ గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోషా శ్రీనివాస్ అన్నారు. సోమవారం భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో నూతనంగా గ్రామ పంచాయతీ తరుపున ఏర్పాటు చేసిన ఫారమ్ పాండ్, నూతనంగా నిర్మాణమైన ఇండ్లు, ఇంకుడు గుంతలు లేని ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించారు. ఇంకుడు గుంతల నిర్మాణానికి ముందుకు వచ్చిన వారి ఇండ్ల వద్ద 20 ఇంకుడు గుంతలకు ముగ్గు పోసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు మాత్రమే కాదు గ్రామంలో ఇంకా ఎవరైనా సరే ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని సూచించారు. దీనివల్ల భూగర్భ జలాలు మనకు ఎంతో పెరుగుతాయని మురికి నీరు నిల్వ కాకుండా ఉండడంవల్ల అంటు వ్యాధులు ప్రబలకుండా ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంత నిర్మించుకోవాలని ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క ఇంకుడు గుంతకు 6500/- చెల్లిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక వేత్త డా, ర్యాకల శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి నర్సింగ్ రావు, ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబీ యాకుబ్, బొమ్మారపు రామక్రిష్ణ, బొమ్మారపు లక్ష్మి బాల్ రాజ్, బీట్కూరి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్, ఫీల్డ్ అసిస్టెంట్ రామస్వామి, కారోబార్ సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story