- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్య, ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలి
గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణం, పోషకాహారం అందేలా ప్రతి ఉపాధ్యాయుడు, అంగన్వాడీ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు.

దిశ, ఉట్నూర్ : గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణం, పోషకాహారం అందేలా ప్రతి ఉపాధ్యాయుడు, అంగన్వాడీ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఐటీడీఏ పీవో మంద మకరందు అన్నారు. సోమవారం మండలంలోని యెందాలోని గిరిజన ఆశ్రమ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. విద్యార్థుల అభ్యాస స్థాయిని తెలుసుకునేందుకు ఆలోచనాత్మక ప్రశ్నలు అడిగి, వారి మేధో సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా చిన్నచిన్న పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, లక్ష్యసాధన అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాలను పరిశీలించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై ఆరా తీశారు.
ప్రతి విద్యార్థికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని, వైద్య నివేదికలను సక్రమంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే విద్య వీక్ష యాప్ ద్వారా విద్యార్థుల వివరాలు, ఆరోగ్య సమాచారం, పాఠశాల కార్యకలాపాలను ఎప్పటికప్పుడు సక్రమంగా అప్‌లోడ్ చేస్తున్నారా అనే విషయాన్ని సంబంధిత సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. యాప్‌లో నమోదు చేసే వివరాలు ఖచ్చితంగా, సమయానికి నమోదు చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రం పనితీరు పై ఆరా తీశారు. అందరికీ పౌష్టికాహారం అందించేలా చూడాలన్నారు. ఐటీడీఏలో నిర్వహించిన గ్రీవెన్స్ లో పీవో పాల్గొని గిరిజనుల నుండి అర్జీలు స్వీకరించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారానికి గిరిజనులు ఐటీడీఏకి వచ్చి వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు తదితరులు ఉన్నారు.






