ఐఐటీ విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేత

by Vemula.Srinu Prasad |

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఔదార్యం చాటుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా విద్యార్థులకు తన వంతుగా సహాయ, సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ...

ఐఐటీ విద్యార్థికి ల్యాప్‌టాప్ అందజేత
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఔదార్యం చాటుకున్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ ద్వారా విద్యార్థులకు తన వంతుగా సహాయ, సహకారాలు అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. ఐఐటీ వారణాసిలో సీటు సాధించిన సిరిసిల్లకు చెందిన గడదాస్ అభినవ్ తల్లిదండ్రులు లక్ష్మీనారాయణ, శ్రీలతతో కలిసి హైదరాబాద్‌లో కేటీఆర్‌ను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. చేనేత కుటుంబానికి చెందిన అభినవ్‌ను ఐఐటీలో సీటు సాధించడంతో కేటీఆర్ శాలువాతో సత్కరించారు. అనంతరం గిఫ్ట్ ఏ స్మైల్ కింద ల్యాప్‌టాప్ అందజేశారు. కళాశాల ఫీజు సైతం తాను చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు అభినవ్, తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story