- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్వే నంబర్ 18 ప్రభుత్వ భూమిని కబ్జా కాకుండా కాపాడాలి: ఎమ్మెల్యే
అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 18లోని 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా బారి నుంచి కాపాడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

దిశ, కూకట్పల్లి: అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సర్వే నంబర్ 18లోని 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా బారి నుంచి కాపాడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. అల్లాపూర్ డివిజన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం పర్యటించారు. ముందుగా డివిజన్ పరిధిలో రాజీవ్‌గాంధీ నగర్ కాలనీలో 25 లక్షల వ్యయంతో చేపడుతున్న తాగునీటి పైప్‌లైన్ పనులను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం అల్లాపూర్‌లోని సర్వే నంబర్ 18లోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సర్వే నెంబర్ 18లోని ప్రభుత్వ భూమిని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి కేటీఆర్ సహకారంతో నాలుగు ఎకరాల భూమిలో పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తెలుగు, ఉర్దూ మీడియం పాఠశాల ఏర్పాటు, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కేటాయించిన 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించి ప్రహరి నిర్మాణ పనులు చేపట్టేందుకు ఆదేశించడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ నాయకులు కోట్ల రూపాయల విలువ చేసే భూములను కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ సహకారంతో ప్రభుత్వ భూమికి చుట్టూ ఫెన్సింగ్ పనులు చేపట్టడం జరిగిందని, వీలైనంత త్వరగా అధికారులు స్కూల్ నిర్మాణ పనులకు బడ్జెట్ కేటాయించి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పాఠశాలలను నిర్మించాలని కోరారు. ప్రభుత్వం సహకారం అందించకపోతే కెసిఆర్ ప్రభుత్వం వచ్చాక ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పాఠశాల భవనాలను నిర్మిస్తామని అన్నారు. హైడ్రా, రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు సర్వే నంబర్ 18లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జాలు చేస్తున్నారని ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సబీహా బేగం, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు గౌసుద్దీన్, లింగాల ఐలయ్య, పిల్లి తిరుపతి, ఎన్. సత్యం, వీరా రెడ్డి, బాబా, జ్ఞానేశ్వర్, జగన్, శ్రీనివాస్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, మల్లికార్జున, రమేష్, హమీద్, రామ్ రెడ్డి, రాజు, సంజీవ, జిలాని, నూర్ ఖాన్, మోయిజ్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.






