మూడు నెలల జీతాలు ఇప్పించండి.. ఎంపీడీఓకు వినతి పత్రం అందజేసిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు

by Kodari Anjali |

వెంటనే జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నాగిరెడ్డిపేట్ మండల ఫీల్డ్‌ అసిస్టెంట్లు సోమవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గంగాధర్ కు వినతి పత్రం అందజేశారు.

మూడు నెలల జీతాలు ఇప్పించండి.. ఎంపీడీఓకు వినతి పత్రం అందజేసిన ఫీల్డ్‌ అసిస్టెంట్లు
X

దిశ, నాగిరెడ్డిపేట్: మూడు నెలలుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నామని, వెంటనే జీతాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నాగిరెడ్డిపేట్ మండల ఫీల్డ్‌ అసిస్టెంట్లు సోమవారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ గంగాధర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లు మాట్లాడుతూ మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో తమ కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మేము వీబీజీ రాంజీ పథకంలో క్షేత్ర స్థాయిలో కూలీలకు పనులు కల్పించడం, పనులు కూలీల వివరాలను ఆన్లైన్‌లో నమోదు చేయడం, దీంతో పాటు ఇందిరమ్మ ఇల్లు ఫొటో క్యాప్చర్, వనమహోత్సవం లాంటి అదనపు పనులు నిర్వర్తిన్నామని చెప్పారు. కానీ తమపై అదనపు పనుల భారం మోపుతున్నారని ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఫీల్డ్‌ అసిస్టెంట్ల జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, సోమవారం నిర్వహించిన తమ శాఖ సమీక్ష సమావేశంను బహిష్కరించినట్లు వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో సక్కుబాయి,ఆయా గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Next Story