గాదె సాయికృష్ణ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

by Vemula.Srinu Prasad |

గాదె సాయికృష్ణ కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని సిట్ (SIT) ఆఫీసులో సీఐ నాగరాజును విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆయనను 7 రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది...

గాదె సాయికృష్ణ కేసు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్: గాదె సాయికృష్ణ కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలోని సిట్ (SIT) ఆఫీసులో సీఐ నాగరాజును విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఈ మేరకు ఆయనను 7 రోజుల పాటు విచారించేందుకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. గతంలో విధించిన మిగిలిన షరతులు, నిబంధనలన్నీ యధావిధిగా కొనసాగుతాయని కోర్టు స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ సిట్ బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం నుంచే సీఐ నాగరాజును సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నారు. సీఐ నాగరాజు విచారణ ద్వారా మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది.

జరిగిందిదీ...

కాగా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో నిందితుడు గాదె సాయికృష్ణ లాకప్ డెత్‌కు గురైన కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో మరింత విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని తొలుత హైకోర్టును ఆశ్రయించింది. అయితే కస్టడీకి అనుమతించిన ధర్మాసనం పలు షరతులు విధించింది. దీంతో ఈ తీర్పును సిట్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో తాజాగా సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story