సంతాప సభలకు వెళ్లొద్దనే దుర్మార్గపు ఆలోచన చంద్రబాబుది: అంబటి

by Vemula.Srinu Prasad |

రాజకీయ అంశాలలో కలవడం, సంతాపాన్ని తెలియజేసే సందర్భాలలో కలవడం రెండూ వేర్వేరు విషయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ముద్రగడ సభ వేదికను బోండా ఉమాతో పంచుకోవడం, టీడీపీ అధిష్టానం సీరియస్ అవడం వంటి ఘటనలపై ఆయన స్పందించారు. ...

సంతాప సభలకు వెళ్లొద్దనే దుర్మార్గపు ఆలోచన చంద్రబాబుది: అంబటి
X

దిశ, వెబ్ డెస్క్: రాజకీయ అంశాలలో కలవడం, సంతాపాన్ని తెలియజేసే సందర్భాలలో కలవడం రెండూ వేర్వేరు విషయాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ముద్రగడ సభ వేదికను బోండా ఉమాతో పంచుకోవడం, టీడీపీ అధిష్టానం సీరియస్ అవడం వంటి ఘటనలపై ఆయన స్పందించారు. సంతాప సభలకు కూడా నాయకులు వెళ్లకూడదని భావించడం సరికాదని, అది చంద్రబాబు నాయుడి దుర్మార్గపు ఆలోచన తీరుకు నిదర్శనమని ఆయన విమర్శించారు. రాజమండ్రిలో జరిగిన సభకు జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా హాజరైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు లాంటి దుర్బుద్ధి లేదని అంబటి అభిప్రాయపడ్డారు. ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం వల్లే ఆ నాయకులు సభకు వెళ్లారని పవన్ భావించి ఉంటారని తెలిపారు. రాజకీయాలకు, మానవతా దృక్పథంతో కూడిన సంతాప కార్యక్రమాలకు మధ్య ఉన్న తేడాను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రకమైన వైఖరి ద్వారా చంద్రబాబు సంకుచిత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఇలాంటి వైఖరిని అవలంబిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.

Next Story