- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Central cabinet: తెలుగు రాష్ట్రాలకు కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్.. కీలక ప్రాజెక్టుకు ఆమోదం
బళ్లారి-చిక్కజాజూర్ రైల్వే లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర కేబినెట్ (Central Cabinet) మరో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో రెండు ప్రధాన మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు ఆమోదముద్ర వేసింది. జార్ఖండ్, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలను కవర్ చేసే రైల్వే లైన్ డబ్లింగ్ కు కేంద్రం ఆమోదం తెలిపింది. వీటి మొత్తం వ్యయం రూ.6,405 కోట్లు అని కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించిన కేంద్రమంత్రి అశ్వని వైష్ణవ్ (AshwiniVaishnaw) తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో..
కేంద్రం ఆమోదించిన వాటిలో బళ్లారి-చిక్కజాజూర్ (Ballari–Chikjajur) రైల్వే లైన్ డబ్లింక్ ఒకటి. రూ. 3,342 కోట్లతో 185 కిలోమీటర్ల మేర ఈ లైన్ ను డబ్లింగ్ చేయబోతున్నది. ఈ నిర్ణయంతో మంగళూరు పోర్టును సికింద్రబాద్ తో అనుసంధానానికి మార్గం సుగమం కానుంది. కర్ణాటకలోని బళ్లారి, చత్రదుర్గ, ఏపీలోని అనంతపురం మీదుగా డబ్లింగ్ లైన్ ఉండనుంది. ఈ డబ్లింగ్ లైన్ తో వాణిజ్య రవాణా మరింతగా పెరగనుంది. కేబినెట్ ఆమోదించిన మరో లైన్ కోడెర్మా-బర్కకానా (Koderma–Barkakana) ట్రాక్ డబ్లింగ్. ఇది 133 కి.మీ పొడవుతో జార్ఖండ్‌లోని ప్రధాన బొగ్గు ఉత్పత్తి ప్రాంతం గుండా వెళ్లడమే కాకుండా పాట్నా, రాంచీ మధ్య అతి తక్కువ మరింత సమర్థవంతమైన రైలు లింక్‌గా నిలవబోతుందని మంత్రి వెల్లడించారు.
కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరిస్తూ మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడానికి అనేక ప్రాజెక్టులు చేపట్టినట్లు తెలిపారు. ఐఐఎం బెంగళూరు, ఐఐఎస్ కలకత్తా ఇటీవల చేసిన అధ్యయనం ప్రకారం రవాణాలో పెట్టుబడులు దేశంలో లాజిస్టిక్స్ ఖర్చులో సుమారు 4 శాతం తగ్గింపుకు కారణమయ్యాయని స్పష్టం చేసినట్లు తెలిపారు. గత ఏడాదిలో రవాణా ప్రాజెక్టుల కోసం సుమారు రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదించబడ్డాయని ఇది మా లక్ష్యాన్ని చేరుకోవడంలో పెద్ద పాత్ర పోషిస్తుందని అశ్వినీ వైష్ణవ్ వివరించారు.
Read More..
ఏపీ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం.. ఉద్యోగులకు ఆ ఆర్థిక సాయం పెంపు






