Ahmedabad Plane Crash : విమాన ప్రమాదంపై బ్రిటన్ దిగ్భ్రాంతి

by Muthe.Rajitha |   (  Updated:2025-06-12 11:29:38  IST  )

గుజరాత్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)పై బ్రిటన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

Ahmedabad Plane Crash : విమాన ప్రమాదంపై బ్రిటన్ దిగ్భ్రాంతి
X

దిశ, వెబ్ డెస్క్ : గుజరాత్ లో నేడు జరిగిన ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)పై బ్రిటన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. విమాన ప్రమాదంపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్(British PM Keir Starmer) స్పందిస్తూ.. ఘటనా దృశ్యాలు విదారకంగా ఉన్నాయని, పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నామని వెల్లడించారు. మధ్యాహ్నం 1.39 సమయంలో అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్ వెళ్తున్న ఎయిర్‌ఇండియా(Air India Flight Crash)కు చెందిన AI 171 బోయింగ్ విమానం టేకాఫ్‌ అయిన వెంటనే సమీపంలోని మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్, మరో రెండు భారీ భవనాలపై కుప్పకూలింది. ఈ విమానంలో 12 మంది సిబ్బంది సహా 242మంది ప్రయాణికులు ఉన్నారు.

విమాన ప్రమాద సమయంలో 169 మంది భారతీయులు, 53మంది బ్రిటన్ వాసులు, ఒక కెనడియన్‌, ఏడుగురు పోర్చుగల్ వాసులు, ఇద్దరు శిశువులు సహా 13 మంది చిన్నారులు ఫ్లైట్ లో ఉన్నారు. కాగా ఈ ప్రమాదంలో 150 మందికి పైగా మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం. మరోవైపు మెడికల్ కాలేజీకి చెందిన 20 మంది మెడికోలు కూడా దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

భయానకంగా గగనయానం.. ఇప్పటి వరకు భారత్‌లో ఎన్ని విమానప్రమాదాలు జరిగాయంటే?

Next Story