‘బాయ్‌ఫ్రెండ్ వస్తున్నాడు.. కండోమ్స్ కావాలి’.. బైక్ టాక్సీ రైడర్‌కు యువతి వింత రిక్వెస్ట్!

by Ramesh Naini |   (  Updated:2026-02-11 14:41:22  IST  )

సోషల్ మీడియా పుణ్యమా అని రోజుకో వింత ఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా ఒక యువతి బైక్ ట్యాక్సీ రైడర్‌ను కోరిన అభ్యర్థన నెటిజన్లను విస్మయానికి గురి చేయడమే కాకుండా, చర్చకు దారితీసింది.

‘బాయ్‌ఫ్రెండ్ వస్తున్నాడు.. కండోమ్స్ కావాలి’.. బైక్ టాక్సీ రైడర్‌కు యువతి వింత రిక్వెస్ట్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా పుణ్యమా అని రోజుకో వింత ఘటన వెలుగులోకి వస్తోంది. తాజాగా ఒక యువతి బైక్ ట్యాక్సీ రైడర్‌ను కోరిన అభ్యర్థన నెటిజన్లను విస్మయానికి గురి చేయడమే కాకుండా, చర్చకు దారితీసింది. తన బాయ్‌ఫ్రెండ్ వస్తున్నాడని, అత్యవసరంగా కండోమ్స్ కావాలంటూ ఆమె చేసిన రిక్వెస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక యువతి బైక్ రైడ్ బుక్ చేసింది. డ్రైవర్ ఆమె చెప్పిన లొకేషన్‌కు చేరుకుని ఓటీపీ (OTP) అడగగా, అసలు విషయం బయటపడింది. తాను ఎక్కడికి రావడం లేదని, తనకు ఒక చిన్న సాయం కావాలని ఆమె డ్రైవర్‌ను కోరింది. ‘నా బాయ్‌ఫ్రెండ్ వస్తున్నాడు, నాకు అర్జెంట్‌గా కండోమ్స్ కావాలి. బయట షాపుకు వెళ్లి అడగాలంటే సిగ్గుగా ఉంది. దయచేసి మీరు తెచ్చి పెడతారా?’ అని ఆమె ప్రాధేయపడింది.

రైడర్ షాక్.. నెటిజన్ల రియాక్షన్..

యువతి మాటలకు సదరు రైడర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ‘రైడ్ బుక్ చేసి ఇలాంటివి అడగడం ఏంటి? నా కోసం కూడా నేను ఇప్పటివరకు అవి కొనలేదు’ అంటూ డ్రైవర్ అసహనం వ్యక్తం చేశాడు. అయితే, ఆమె పదే పదే రిక్వెస్ట్ చేయడంతో మనసు మార్చుకున్న రైడర్, చివరకు ఆమెకు కావాల్సినవి తెచ్చి ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం వ్యూస్ కోసం ప్లాన్ చేసి తీసిన 'స్క్రిప్ట్' వీడియో అని మెజారిటీ నెటిజన్లు కొట్టిపారేస్తున్నారు. అదేదో బాయ్ ఫ్రెండ్‌నే కొనమనొచ్చుకదా?, ప్రస్తుత రోజుల్లో ఇలాంటి వింతలు జరగడం సాధ్యమేనని కొంత మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

కేరళ వీధుల్లో ‘మర మనిషి’ హల్‌చల్.. నెట్టింట వైరల్

Next Story