- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్నాటకలో తమిళనాడు సీన్ రిపీట్.. సీఎం మార్పువేళ బిగ్ ట్విస్ట్
కర్ణాటకలో సీఎం మార్పు దాదాపు ఖరారైనట్టు కనిపిస్తోంది. సీఎం సిద్దరామయ్యను దించేసి డీకే శివకుమార్ నున సీఎం కుర్చీపై కూర్చోబెట్టేందు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధం అవుతోంది. ఇప్పటికే తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని, రాజ్యసభకు వెళ్లను అని సిద్ధరామయ్య సైతం ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటకలో సీఎం మార్పు దాదాపు ఖరారైనట్టు కనిపిస్తోంది. సీఎం సిద్దరామయ్యను దించేసి డీకే శివకుమార్ నున సీఎం కుర్చీపై కూర్చోబెట్టేందు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధం అవుతోంది. ఇప్పటికే తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని, రాజ్యసభకు వెళ్లను అని సిద్ధరామయ్య సైతం ప్రకటించారు. అయితే సీఎం మార్పువేళ కర్ణాటకలో గవర్నర్ లేకపోవడంతో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. దీంతో సిద్దరామయ్య తన రాజీనామాను గవర్నర్ కు ఎలా సమర్పిస్తారనేది ప్రశ్నగా మారింది. ఇటీవల తమిళనాడులోనూ ఇలాంటి పరిణామాలే కనిపించాయి.
తమిళనాడులో విజయ్ సర్కార్ కు పూర్తి మెజారిటీ లేకపోవడంతో ఆయన బలనిరూపన చేసుకునేందుకు సమయం పట్టింది. అలాంటి పరిస్థితుల్లో గవర్నత్ తన వ్యక్తిగత పనులపై వేరే ప్రాంతానికి వెళ్లారు. ఇప్పుడు కర్ణాటకలోనూ సీఎం మార్పు చుట్టూ రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. ఇలాంటి సమయంలో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వ్యక్తిగత పనులపై ముంబై వెళ్లడం రాజకీయవర్గాల్లో తీవ్రచర్చకు దారితీస్తోంది. నిజానికి గవర్నర్ భౌతికంగా హాజరవ్వలేకపోయినా సీఎం తన రాజీనామాను అధికారిక మార్గాల ద్వారా సమర్పించవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో సిద్దరామయ్య అలానే చేస్తారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చూడాలి మరి కర్ణాటకీయం చివరికి ఎలాంటి మలుపు తిరుగుందో.






