- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యేగానే కొనసాగుతా.. రాజ్యసభకు వెళ్లను: క్లారిటీ ఇచ్చిన సీఎం సిద్ధరామయ్య
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఇప్పటికే జోరందుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక (Karnataka) కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పులు క్లైమ్యాక్స్ వచ్చేసింది. ఇవాళ సీఎం పదవికి సిద్ధరామయ్య (Siddaramaiah) రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆయన స్థానంలో నూతన సీఎం కర్ణాటక ఆ పార్టీ ట్రబుల్ షూటర్, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) పగ్గాలు చేపట్టడం దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే సిద్ధరామయ్యకు ఏఐసీసీ పెద్దలు రాజ్యసభ (Rajya Sabha) సీటును ఆఫర్ చేయగా.. తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు సీఎం కుర్చీ త్యాగం చేసేందుకు సీఎం సిద్ధరామయ్య అంగీకరించడం వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు కొన్ని కీలక హామీలు ఇచ్చినట్లుగా పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ నడుస్తోంది. కొత్తగా ఏర్పాటు కాబోయే కేబినెట్ (Cabinet)లో ఆయన కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర సిద్ధరామయ్యకు చోటు కల్పించేలా ఒప్పందం కుదిరినట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించే ముందు, ఇవాళ బెంగళూరులో కాంగ్రెస్ శాసనసభా పక్ష (CLP) సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ భేటీలోనే కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరును అధికారికంగా ప్రతిపాదించి.. ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించనున్నారు.






