టీవీకే విజయ్‌కు బిగ్ షాక్.. డీఎంకేలో చేరిన సెల్వకుమార్

by Malleboina Mahesh |   (  Updated:2025-12-11 07:13:21  IST  )

త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యాక్టర్, టీవీకే అధ్యక్షుడు విజయ్ కు బిగ్ షాక్ తగిలింది.

టీవీకే విజయ్‌కు బిగ్ షాక్.. డీఎంకేలో చేరిన సెల్వకుమార్
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యాక్టర్, టీవీకే అధ్యక్షుడు విజయ్ (TVK President Vijay)కు బిగ్ షాక్ తగిలింది. నటుడు విజయ్ స్థాపించిన కొత్త పార్టీ అయిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల్లో ఒకరైన సెల్వకుమార్ పార్టీకి రాజీనామా చేసి, అధికార డీఎంకే (DMK) పార్టీలో చేరారు. సెల్వకుమార్ గతంలో విజయ్ అభిమాన సంఘాలకు అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలం నుంచి ఆయనకు సన్నిహితుడిగా ఉన్నారు. టీవీకే ఏర్పాటులో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. అయితే, ఊహించని విధంగా ఆయన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) సమక్షంలో డీఎంకే కండువా కప్పుకున్నారు.

సెల్వకుమార్ (Selvakumar) అనుచరులు కూడా డీఎంకే (DMK)లో చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం కొత్తగా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టిన విజయ్‌కు ఎదురుదెబ్బగా మారింది. సెల్వకుమార్ పార్టీని వీడటానికి గల కారణాలపై టీవీకే ఇంకా స్పందించాల్సి ఉంది. అయితే సెల్వకుమార్ మాత్రం తనకు పార్టీలో తగిన గుర్తింపు దక్కడం లేదని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి కాకుండా ఇటీవల పార్టీలో చేరిన వారికి విజయ్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఈ విధానం నచ్చకపోవడంతో తాను తన అనుచరులు పార్టీని వీడి, డీఎంకేలో చేరినట్లు సెల్వకుమార్ మీడియాతో చెప్పుకొచ్చారు.

Read More..

‘జన నాయగన్’ అప్డేట్ ఇచ్చిన అనిరుధ్.. చాలా బాధగా ఉందంటూ ఎమోషనల్

Next Story