- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జన నాయగన్’ అప్డేట్ ఇచ్చిన అనిరుధ్.. చాలా బాధగా ఉందంటూ ఎమోషనల్
దళపతి విజయ్(Thalapathy Vijay) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయి పాలిటిక్స్‌పై తన ఫోకస్ పెట్టబోతున్నాడు.

దిశ, సినిమా: దళపతి విజయ్(Thalapathy Vijay) రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయి పాలిటిక్స్‌పై తన ఫోకస్ పెట్టబోతున్నాడు. ఇటీవల తన పార్టీ మీటింగ్ జరగ్గా.. తొక్కిసలాట జరిగి ఎంతో మంది చనిపోయారు. దీంతో విజయ్‌పై కాస్త విమర్శలు వచ్చాయి. ఇక ఈ విషయం పక్కన పెడితే.. విజయ్ చివరి సినిమాగా రాబోతున్న ‘జన నాయగన్’(Jana nayagan)పై ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాబీ డియోల్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మమిత బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా.. జనవరి 9న విడుదల కాబోతుంది. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ‘జన నాయగన్’ అప్డేట్ ఇచ్చారు. ‘‘జననాయగన్ ఆర్ఆర్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఇది విజయ్ సర్ చివరి సినిమా కావడం బాధగా ఉంది. అందుకే మేము ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నాము. ఆడియో లాంచ్ అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకంటే నేను కత్తి, మాస్టర్, బీస్ట్ , లియో చిత్రాల పాటలతో తలపతివిజయ్‌కు ట్రిబ్యూట్ ఇవ్వబోతున్నా’’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ఈ సినిమాకు పోటీగా ‘ది రాజాసాబ్’ రాబోతుంది. మారుతి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇద్దరు స్టార్ హీరోల్లో ఎవరు గెలుస్తారా? హిట్ అందుకుని బాక్సాఫీసును షేక్ చేసేది ఎవరా అని అందరిలో ఆసక్తి నెలకొంది.
Read More..






