మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-09 16:07:11  IST  )

రాజ్యసభ ఎన్నికల వేళ సంచలనం చోటుచేసుకుంది.

మీనాక్షి నటరాజన్‌కు బిగ్ షాక్.. రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌ (Meenakshi Natarajan)కు ఎదురుదెబ్బ తగిలింది. మధ్యప్రదేశ్‌ నుంచి ఆమె దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి (RO) తిరస్కరించారు. నామినేషన్ పత్రాల్లో కీలక సమాచారాన్ని దాచారంటూ అధికార పక్షం ఇచ్చిన ఫిర్యాదుతో ఎన్నికల అధికారులు ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే, మీనాక్షి నటరాజన్ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత.. ఆమె సమర్పించిన అఫిడవిట్‌పై భారత ఎన్నికల సంఘానికి (ECI) భారతీయ జనతా పార్టీ (BJP) అధికారికంగా ఫిర్యాదు చేసింది. తెలంగాణలో ఆమెపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను అఫిడవిట్‌లో ఉద్దేశపూర్వకంగానే వెల్లడించలేదని బీజేపీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు సంబంధించిన పూర్తి ఆస్తుల వివరాలను, బ్యాంకు నిల్వలను కూడా నామినేషన్ పత్రాల్లో స్పష్టంగా వెల్లడించలేదని బీజేపీ ఆరోపించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులు తమపై ఉన్న కేసులు, ఆస్తులు, అప్పుల వివరాలను పూర్తిగా పారదర్శకంగా అఫిడవిట్‌లో పొందపరచాల్సి ఉంటుంది.

నామినేషన్ రిజెక్ట్..

బీజేపీ ఇచ్చిన ఫిర్యాదుపై లోతుగా విచారణ చేపట్టిన రిటర్నింగ్ అధికారి.. అఫిడవిట్‌లో కేసుల సమాచారం, ఆస్తుల వివరాలను దాచిపెట్టినట్లుగా ఆధారాలు లభించడంతో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ తాజా పరిణామంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అనూహ్యంగా నామినేషన్ల పరిశీలనలోనే మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ అవ్వడంతో రాజ్యసభ స్థానాల గెలుపు సమీకరణాలు మారే అవకాశం ఉంది.

మీనాక్షి కేసుల ముచ్చట చెప్పిందే ఆ పార్టీ నేతలు...తెలంగాణ నుంచి మాకు చిట్టీ అందింది

Next Story