- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్యాంకు మేనేజర్ చెంప పగులగొట్టిన మాజీ కేంద్రమంత్రి కూతురు
తమిళనాడు మాజీ కేంద్ర మంత్రి ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి, ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ మేనేజర్‌పై భౌతిక దాడికి దిగడం తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు మాజీ కేంద్ర మంత్రి ఎంకే అళగిరి కుమార్తె కయల్‌విళి, ఒక ప్రభుత్వ రంగ బ్యాంక్ మేనేజర్‌పై భౌతిక దాడికి దిగడం తీవ్ర కలకలం రేపింది. చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఉన్న కయల్‌విళికి చెందిన భవనంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖ కొనసాగుతోంది. అయితే ఈ భవనంలోని లిఫ్ట్ పనిచేయకపోవడంతో, దాన్ని బాగు చేయించే విషయంపై మాట్లాడేందుకు బ్యాంక్ మేనేజర్ హర్షిన్ సింగ్ ముందుగా కయల్‌విళి అసిస్టెంట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించారు. అసిస్టెంట్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, ఆయన నేరుగా కయల్‌విళికి ఫోన్ చేసి లిఫ్ట్ పనిచేయడం లేదన్న విషయాన్ని తెలిపారు.
ఆ తర్వాత బ్యాంకు వద్దకు చేరుకున్న కయల్‌విళి, తనకు నేరుగా ఫోన్ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మేనేజర్‌ను ప్రశ్నించారు. ఆ సమయంలో మేనేజర్ హర్షిన్ సింగ్ ఛైర్లోనే కూర్చుని ఉండగా, కయల్‌విళి ఒక్కసారిగా ఆయన చెంపపై కొట్టారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు బ్యాంకులోని సీసీటీవీ (CCTV) కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. ఈ దారుణ ఘటనపై ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడంతో, పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.






