నేపాల్‌ రూపాయి నాణెంపై భారత్ ప్రాంతాలు

by Muthe.Rajitha |

భారత్, నేపాల్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా నడుస్తున్న సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది.

నేపాల్‌ రూపాయి నాణెంపై భారత్ ప్రాంతాలు
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్, నేపాల్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా నడుస్తున్న సరిహద్దు వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. భారత్‌తో వివాదాస్పదంగా ఉన్న లింపియాధుర, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాలను తమ భూభాగంలో భాగంగా చూపే మ్యాప్‌ను నూతనంగా ముద్రించే రూపాయి నాణెంపై ముద్రించేందుకు నేపాల్ దేశపు జాతీయ బ్యాంకు సిద్ధమైంది. చారిత్రాత్మకంగా, భౌగోళికంగా ఈ ప్రాంతాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అంతర్భాగమని భారతదేశం స్పష్టం చేస్తూ వస్తోంది. అంతేకాకుండా, ఈ సరిహద్దు వివాదాలను ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని భారత్ మొదటి నుంచీ సూచిస్తోంది.

వాస్తవానికి, 2020 మే నెలలో కె.పి. శర్మ ఓలీ నేతృత్వంలోని నేపాల్ ప్రభుత్వం ఈ మూడు ప్రాంతాలను తమ భూభాగంలో కలుపుతూ నూతన అధికారిక మ్యాప్‌ను విడుదల చేసింది. అయితే, తదనంతర పరిణామాలలో ప్రస్తుత ప్రధాని బాలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం ఈ వివాదాస్పద మ్యాప్‌ను నాణేలపై నుంచి తొలగించి, దాని స్థానంలో ఒక ప్రముఖ మఠం చిత్రాన్ని ముద్రించాలని ఇటీవల ప్రతిపాదించింది. కానీ, ఈ నిర్ణయాన్ని నేపాల్‌లోని విపక్షాలు, జాతీయవాద వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. విపక్షాల నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం, పాత నిర్ణయాన్ని పునఃపరిశీలించి కొత్తగా రూపొందిస్తున్న రూపాయి నాణెంపై వివాదాస్పద మ్యాప్‌ను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Next Story