- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్రాన్స్, స్పెయిన్ లో భారీ కార్చిచ్చు.. 3 లక్షల మంది తరలింపు
ఐరోపా ఖండాన్ని తీవ్రమైన వేడిగాలులు, కార్చిచ్చు (Wildfires) వణికిస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : ఐరోపా ఖండాన్ని తీవ్రమైన వేడిగాలులు, కార్చిచ్చు (Wildfires) వణికిస్తున్నాయి. ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో ఎండల తీవ్రత పెరగడంతో అడవుల్లో భారీగా మంటలు చెలరేగి వేగంగా నివాస ప్రాంతాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పరిస్థితులు దారుణంగా తయారవ్వడంతో ఇరు దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమై, దాదాపు 3 లక్షల మందికి పైగా ప్రజలను ఇళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్ ప్రాంతంలో మరియు స్పెయిన్‌లోని మాడ్రిడ్ (Madrid) పరిసర ప్రాంతాల్లో దావాగ్ని ఉధృతి అత్యంత తీవ్రంగా ఉంది. స్పెయిన్ లో 1.15 ఎకరాలు, ఫ్రాన్స్ లో 2.3 లక్షల ఎకరాల అటవీ భూమి బూడిదవ్వడమే కాకుండా, పొగ దట్టంగా అలుముకోవడంతో అనేక మార్గాల్లో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. విపత్తు నిర్వహణ దళాలు, హెలికాప్టర్ల ద్వారా మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఈదురుగాలులు, వేడి వాతావరణం వల్ల మంటలు అదుపులోకి రావడం సవాళ్లుగా మారింది. బాధితుల కోసం తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అత్యవసర వైద్యం, ఆహారాన్ని అందిస్తున్నారు.






