Fire Accident: చెర్వుగట్టులో భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన 17 దుకాణాలు

by Kema Shiva Kumar |

నార్కట్‌పల్లి మండల పరిధిలోని చెర్వుగట్టు గుట్ట కింద అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Fire Accident: చెర్వుగట్టులో భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన 17 దుకాణాలు
X

దిశ, వెబ్‌డెస్క్: అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన నల్గొండ (Nalgonda) జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం చెర్వుగట్టు (Chervugattu) పార్వతీ జడల రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో చోటుచేసుకుంది. గుట్ట కింద అకస్మాత్తుగా చెలరేగిన భారీ మంటల కారణంగా బొమ్మల దుకాణాలు కాలిబూడిదయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గుట్ట కింద ఉన్న ఓ బొమ్మల దుకాణంలో మొదటగా మంటలు ప్రారంభమయ్యాయి. గాలుల ధాటికి ఇవి క్షణాల్లోనే పక్కనే ఉన్న ఇతర షాపులకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మొత్తం 17 వ్యాపార దుకాణాలు, 15 తోపుడు బండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల తీవ్రతకు దుకాణాల్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలిపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర భయాందోళన వ్యక్తమైంది.

కాలిపోయిన పంచాయతీ దస్త్రాలు..

ప్రమాద స్థలానికి సమీపంలోనే ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయానికి సైతం మంటలు అంటుకున్నాయి. దీంతో ఆఫీసులోని ముఖ్యమైన ప్రభుత్వ దస్త్రాలు, రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ.2.5 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానిక సర్పంచ్ తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజిన్లతో స్పాట్‌కు చేరుకుని తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదం అర్ధరాత్రి వేళ జరగడం, ఆ సమయంలో దుకాణాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story