మీనాక్షి కేసుల ముచ్చట చెప్పిందే ఆ పార్టీ నేతలు.. బాంబు పేల్చిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-09 16:11:17  IST  )

మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్ విజయ్‌వర్గీయ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీనాక్షి కేసుల ముచ్చట చెప్పిందే ఆ పార్టీ నేతలు.. బాంబు పేల్చిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) దాఖలు చేసిన రాజ్యసభ నామినేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించడం సంచలనం రేపుతోంది. ఓ వైపు కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీలోని ఈసీ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తమకు జరిగిన అన్యాయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే, ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కైలాష్ విజయ్‌వర్గీయ (Kailash Vijayvargiya) బాంబు పేల్చారు. అసలు మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణలో కేసులు ఉన్నాయనే విషయం తమకు తెలియనే తెలియదని అన్నారు. తమకు సమాచారం ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నేతలేనని.. అక్కడి నుంచే చిట్టీ అందింటూ కుండబద్దలు కొట్టారు. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ఇక అర్థం చేసుకోండి ఆ పార్టీ వ్యవహారం ఎలా ఉందో అంటూ మీడియాతో మంత్రి కైలాష్ విజయ్‌వర్గీస్ కామెంట్ చేశారు.

అప్పుడు ‘ఓట్ చోరీ’.. ఇప్పుడు ‘సీటు చోరీ’: నామినేషన్ తిరస్కరణపై సీఎం రేవంత్ ఫైర్

Next Story