ఇంద్రకీలాద్రిపై ‘ఆషాఢ సారె’ వేడుకలు.. కనకదుర్గమ్మకు తెలంగాణ బోనాల సమర్పణ

by Kema Shiva Kumar |

విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ఇవాళ తెలంగాణ బోనాలను సమర్పించనున్నారు.

ఇంద్రకీలాద్రిపై ‘ఆషాఢ సారె’ వేడుకలు.. కనకదుర్గమ్మకు తెలంగాణ బోనాల సమర్పణ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, భక్తుల కొంగుబంగారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆషాఢ సారె వేడుకలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ దుర్గమ్మకు భక్తిశ్రద్ధలతో తెలంగాణ బోనాలను సమర్పించనున్నారు. అయితే, భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో గత 16 ఏళ్లుగా ఇంద్రకీలాద్రిపై ఈ బోనాల సమర్పణ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. హైదరాబాద్ నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి నైవేద్యంగా బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు.

వీఐపీ దర్శనాలు రద్దు..

తెలంగాణ బోనాల సమర్పణ, ’ఆషాఢ సారె’ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తే అవకాశం ఉండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రొటోకాల్, వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు. ఇక ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు వైపు ప్రైవేటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధించారు. సాధారణ భక్తులకు సులభంగా కనకదుర్గ అమ్మవారి దర్శనం కలిగేలా ఆలయ అధికారులు, పోలీసులు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టారు.

Next Story