- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘బెర్లిన్ ప్రైడ్ ఫెస్టివల్’లో జనంపైకి దూసుకెళ్లిన బస్సు.. ఒకరు మృతి, 17 మందికి తీవ్ర గాయాలు
బెర్లిన్ ప్రైడ్ ఫెస్టివల్‌లో జనంపైకి వాహనం దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు.

దిశ, వెబ్‌డెస్క్: జర్మనీ రాజధాని బెర్లిన్ (Berlin)లో అర్థరాత్రి దాటాక ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ ‘బెర్లిన్ ప్రైడ్ ఫెస్టివల్’ వేడుకల సందర్భంగా టెయిర్‌గార్టెన్ పార్క్ (Tiergarten Park) సమీపంలో బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద ప్రశాంతంగా గడుపుతున్న జనంపైకి ఓ బస్సు వేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఎనిమిది మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నటుగా తెలుస్తోంది. తెల్లటి రంగు వ్యాన్ వేగంగా జనంపైకి దూసుకొచ్చి, అనంతరం చెట్టును బలంగా ఢీకొని ఆగిపోయింది. ఆ తర్వాత వాహనం నడుపుతున్న వ్యక్తి కాలినడకన పరారయ్యాడు. బెర్లిన్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని గుర్తించారు. నిందితుడికి స్థానిక ఇస్లామిస్ట్ శ్రేణులతో సంబంధాలు ఉన్నాయని, అతడిని అరెస్ట్ చేసేందుకు ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.






