కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన 12 మంది కౌన్సిలర్లు

by Ramesh Naini |   (  Updated:2026-01-08 05:51:08  IST  )

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 12 మంది కౌన్సిలర్లు బీజేపీలో చేరి పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు.

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన 12 మంది కౌన్సిలర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన 12 మంది కౌన్సిలర్లు బీజేపీలో చేరి పార్టీకి బిగ్ షాక్ ఇచ్చారు. మహారాష్ట్ర అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌కు చెందిన 12 మంది కౌన్సిలర్లు బుధవారం రాత్రి బీజేపీలో చేరారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర చవాన్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ప్రజలకు అభివృద్ధి అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, అధికార కాంక్ష కాదని చవాన్ తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోందని, అభివృద్ధి హామీలను నెరవేర్చగలదన్న నమ్మకంతోనే కౌన్సిలర్లు తమ పార్టీలో చేరారని ఆయన అన్నారు.

అసలు ఏమి జరిగిందంటే?

డిసెంబర్ 20న జరిగిన స్థానిక ఎన్నికల్లో 60 మంది సభ్యులున్న అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో శివసేన 27 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీకి 14, కాంగ్రెస్‌కు 12, ఎన్సీపీకి 4 సీట్లు దక్కగా, ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. దీంతో బీజేపీ-కాంగ్రెస్-ఎన్సీపీ కలిసి ‘అంబర్‌నాథ్ వికాస్ అఘాడి’గా పాలక కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ పరిణామాల మధ్య, పార్టీ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ కాంగ్రెస్ తన 12 మంది కౌన్సిలర్లను సస్పెండ్ చేసింది. అనంతరం వారు బీజేపీలో చేరడం మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది.

శివసేన తీవ్ర అసంతృప్తి…

ఈ పరిణామంపై ఎన్డీయే కుటమిలోని అంబర్‌నాథ్ మున్సిపల్ పరిధిలోని శివసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది, ఇది ‘కూటమి ధర్మానికి ద్రోహం’ అంటూ విమర్శించింది. మరోవైపు, భావజాలపరంగా విరుద్ధ పార్టీలతో స్థానికంగా కూటములు పెట్టుకోవడాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సైతం తప్పుబట్టారు. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమైన చర్యలను సహించబోమని సీరియస్ అయ్యారు.

Read More..

నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. మున్సిపోల్స్ పై ప్రధాన చర్చ

Next Story