- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Badrinath ఆలయంలో 17వ తేదీ వరకు దర్శనాలు
దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ ఆలయ ద్వారాల మూసివేత మొదలైంది. అయితే ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో ఒకటైన బద్రీనాథ్ ఆలయంలో ఈ నెల 17వ తేదీ వరకు స్వామివారి దర్శనాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఆదివారం నాడు అధికారులు వెల్లడించారు. కాగా.. శీతాకాలం నేపథ్యంలో చార్‌ధామ్ (Chardham) ఆలయాల ద్వారాలు మూసివేయడం ఎప్పటినుంచో ఓ నియమంగా పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం 12:14కు గంగోత్రి ధామ్ (Gangotri Dham) ద్వారాలు మూసివేయగా.. ఈ రోజు ఉదయం 8:30కు కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు కూడా అర్చకులు మూసివేశారు. ఈ క్రమంలోనే ఆలయం వద్ద ఆర్మీ అధికారుల డప్పు వాయిద్యాలు, సంగీతంతో పాటు భక్తుల కోలాహలం నెలకొంది. ఇక యమునోత్రి ధామ్ (Yamunotri Dham) ఆలయ ద్వారాలు కూడా ఈ రోజు మధ్యాహ్నం 12:04కు మూసివేయనున్నారు నిర్వాహకులు. కాగా.. ఇప్పటివరకు నాలుగు ధామాలలో కలిపి మొత్తం 44 లక్షల మంది భక్తులు సందర్శించినట్లు అధికారులు చెబుతున్నారు.
Read More : మూతపడిన కేదార్ నాథ్ ఆలయం.. మళ్లీ ఆర్నెల్ల తర్వాతే.