- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Kedarnath Temple: మూతపడిన కేదార్ నాథ్ ఆలయం.. మళ్లీ ఆర్నెల్ల తర్వాతే..
దిశ, వెబ్ డెస్క్: భారతదేశ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్ నాథ్ (Kedarnath) ఆలయం తలుపులు మూతపడ్డాయి. శీతాకాలం ప్రారంభం కావడంతో ఆదివారం ఉదయం 8.30 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. ఆలయ తలుపులను మూసివేశారు. మళ్లీ ఆర్నెలల తర్వాతే ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి. ఈ ఆర్నెలలు ఆలయం మంచుతో కప్పబడి ఉంటుంది. అప్పటి వరకూ ఉఖిమఠ్ లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబా ఆరాధన, దర్శనం ఉంటాయి.
శీతాకాలం ప్రారంభం కావడంతో చార్ ధామ్ (Chardham Yatra) ఆలయాలు మూతపడుతున్నాయి. శనివారం గంగోత్రి ధామ్ (Gangotri) తలుపులను మూసివేయగా.. నేడు కేదార్ నాథ్ ఆలయం మూతపడింది. అలాగే యమునోత్రి ఆలయ తలుపులను మధ్యాహ్నం 12.05 గంటలకు మూసివేయనున్నారు. శ్రీ మహావిష్ణువు కొలువైన బద్రీనాథ్ ఆలయాన్ని నవంబర్ 17వ తేదీ రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నారు.
ఇక ఈ ఏడాది మే 10న ప్రారంభమైన చార్ ధామ్ యాత్ర చివరి దశకు చేరుకుంది. శుక్రవారం (నవంబర్ 1) వరకూ 15 లక్షల మంది భక్తులు గంగోత్రి, యమునోత్రి క్షేత్రాలను సందర్శించినట్లు అధికారులు తెలిపారు. భక్తులు జ్యోతిర్లింగాలను సందర్శించి.. ప్రత్యేకంగా పూజలు చేశారు. మళ్లీ వేసవికాలంలోనే ఆలయాల తలుపులు తెరచుకోనున్నారు.
Read More : Badrinath ఆలయంలో 17వ తేదీ వరకు దర్శనాలు