Donald Trump : ట్రంప్‌పై హత్యాయత్నం.. వైట్‌హౌస్‌ పరిసరాల్లో హైఅలర్ట్

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-26 02:52:58  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ లక్ష్యంగా మరోసారి హత్యాయత్నం జరగడం సంచలనం సృష్టించింది. వైట్‌హౌజ్ సమీపంలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.

Donald Trump : ట్రంప్‌పై హత్యాయత్నం.. వైట్‌హౌస్‌ పరిసరాల్లో హైఅలర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ లక్ష్యంగా మరోసారి హత్యాయత్నం జరగడం సంచలనం సృష్టించింది. వైట్‌హౌజ్ సమీపంలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. హోటల్‌లోని డిన్నర్ హాల్‌లో కార్యక్రమం జరుగుతుండగా ఒక్కసారిగా భారీ కాల్పుల శబ్దం వినిపించింది. దుండగుడు దాదాపు 5 నుంచి 8 రౌండ్ల వరకు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. కాల్పుల శబ్దంతో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే ట్రంప్‌ను చుట్టుముట్టి రక్షణ కల్పించారు. కాల్పులు జరిగిన వెంటనే భద్రతా బలగాలు హోటల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. నిందితుడిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. ట్రంప్ సహా అక్కడ ఉన్న ఇతర కీలక నేతలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ట్రూత్ సోషల్‌లో ట్రంప్ స్పందన..

ఈ భీకర ఘటన జరిగిన కొద్దిసేపటికే డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్‌' వేదిక ద్వారా స్పందించారు. తన క్షేమ సమాచారాన్ని తెలియజేస్తూనే, భద్రతా బలగాల పనితీరును ప్రశంసించారు. "నా రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన సీక్రెట్ సర్వీస్ మరియు పోలీస్ విభాగాలు అద్భుతంగా పనిచేశాయి. షూటర్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందరూ క్షేమంగా ఉన్నారు." అని ట్రంప్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా భద్రతా బలగాల పహారాలో ఉంది. కాల్పులకు గల కారణాలు ఏంటి? నిందితుడు ఎవరు? అనే కోణంలో దర్యాప్తు సంస్థలు విచారణను ముమ్మరం చేశాయి. అధ్యక్షుడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి.

ట్రంప్‌పై హత్యాయత్నం: కాల్పుల సమయంలో అదే హోటల్‌లో KA Paul

Next Story