Donald Trump : ట్రంప్‌పై హత్యాయత్నం: కాల్పుల సమయంలో అదే హోటల్‌లో KA Paul

by Gantepaka Srikanth |   (  Updated:2026-04-26 12:49:35  IST  )

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది.

Donald Trump : ట్రంప్‌పై హత్యాయత్నం: కాల్పుల సమయంలో అదే హోటల్‌లో KA Paul
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. వైట్‌హౌజ్ సమీపంలోని హోటల్‌లో జరిగిన ఈ కాల్పుల ఘటన సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా అక్కడే ఉండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. వైట్‌హౌజ్ సమీపంలోని హోటల్‌లో ఏర్పాటు చేసిన కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో గుర్తు తెలియని దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. సుమారు 5 నుంచి 8 రౌండ్ల పాటు కాల్పులు జరగడంతో అక్కడ ఉన్న వారంతా భయాందోళనకు గురయ్యారు. సీక్రెట్ సర్వీస్ బలగాలు వెంటనే స్పందించి ట్రంప్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, హోటల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

షాకింగ్‌కు గురయ్యాను: కేఏ పాల్

ఈ ఘటనపై అదే హోటల్‌లో ఉన్న కేఏ పాల్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. "గడిచిన 37 ఏళ్లుగా నేను ఎప్పుడు అమెరికా వచ్చినా ఇదే హోటల్‌లో బస చేస్తాను. కానీ ఇలాంటి భయానక పరిస్థితిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి." అని ఆయన తెలిపారు. అమెరికా అధ్యక్షుడికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల వల్లే ఇలాంటి హింసాత్మక పరిస్థితులు దాపురిస్తున్నాయని పాల్ వ్యాఖ్యానించారు. మరోవైపు.. హత్యాయత్నం తర్వాత ట్రంప్ తన 'ట్రూత్ సోషల్‌' వేదికగా స్పందిస్తూ.. సీక్రెట్ సర్వీస్, పోలీస్ విభాగాలు అద్భుతంగా పనిచేశాయని ప్రశంసించారు. షూటర్‌ను అదుపులోకి తీసుకున్నామని, తాను క్షేమంగా ఉన్నానని ఆయన ధృవీకరించారు.

వైట్‌హౌజ్‌‌లో ట్రంప్‌ హత్యాయత్నం.. ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే!

Next Story