- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విజయ్‌కి మద్దతిస్తాం.. కానీ మంత్రి పదవులు వద్దు: తమిళనాడులో వామపక్షాల ప్లాన్ ఇదే
తమిళనాడు రాజకీయ పరిణామాలు గంటగంటకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ప్రకటించిన వామపక్ష పార్టీలు (CPI, CPM), తాజాగా తమ తదుపరి కార్యాచరణపై కీలక ప్రకటన చేశాయి.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు రాజకీయ పరిణామాలు గంటగంటకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ప్రకటించిన వామపక్ష పార్టీలు (CPI, CPM), తాజాగా తమ తదుపరి కార్యాచరణపై కీలక ప్రకటన చేశాయి. విజయ్ సర్కార్‌కు మద్దతు ఇస్తామని, అయితే తాము కేబినెట్‌లో చేరడం లేదని స్పష్టం చేశాయి. తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటును పరోక్షంగా అడ్డుకుంటున్న బీజేపీ ఎత్తుగడలను చిత్తు చేయడమే తమ ప్రధాన ఉద్దేశమని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. దేశంలోనూ, రాష్ట్రంలోనూ మతవాద శక్తులకు వ్యతిరేకంగా తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ఆ శక్తులు తమిళనాట పాగా వేయకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని పేర్కొన్నాయి.
డీఎంకేతో స్నేహం.. విజయ్‌కు సహకారం..
విజయ్ పార్టీకి మద్దతు ఇస్తున్నప్పటికీ, తమ పాత మిత్రపక్షమైన డీఎంకే (DMK)తో బంధం తెంచుకోలేదని వామపక్షాలు స్పష్టం చేశాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం డీఎంకేతో కలిసి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించాయి. ప్రభుత్వంలో భాగస్వాములు కాకుండా, కేవలం అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవడానికి మాత్రమే టీవీకేకు సహకరిస్తామని వారు తేల్చి చెప్పారు. వామపక్షాల మద్దతుతో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం సమకూరినట్లయింది. అయితే ప్రభుత్వంలో చేరబోమని లెఫ్ట్ పార్టీలు చెప్పడం, డీఎంకేతో కలిసి పని చేస్తామని ప్రకటించడం.. భవిష్యత్తులో విజయ్ సర్కార్ ఎదుర్కోబోయే సవాళ్లకు సంకేతంగా కనిపిస్తోంది. ఏదేమైనా, బీజేపీని అడ్డుకోవాలనే లక్ష్యంతో వామపక్షాలు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.






