Genz లేదు, గాడిద గుడ్డు లేదు.. తమిళనాట టీవీకే సహా అన్ని పార్టీల పరిస్థితి అంతే

by Ajay Maddhiboyina |

తమిళనాడు ఎన్నికలు పూర్తై ఫలితాలు వచ్చినా ఆ రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఇంకా హాట్ టాపిక్ గానే సాగుతున్నాయి. మెజారిటీ స్థానాలు వచ్చినా మేజిక్ ఫిగర్ దాటకపోవడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు.

Genz లేదు, గాడిద గుడ్డు లేదు.. తమిళనాట టీవీకే సహా అన్ని పార్టీల పరిస్థితి అంతే
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు ఎన్నికలు పూర్తై ఫలితాలు వచ్చినా ఆ రాష్ట్ర రాజకీయ పరిణామాలు ఇంకా హాట్ టాపిక్ గానే సాగుతున్నాయి. మెజారిటీ స్థానాలు వచ్చినా మేజిక్ ఫిగర్ దాటకపోవడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఇతర పార్టీలతో గంటలు గంటలు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో నెట్టింట అనేక ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా ఎన్నిక‌ల అఫిడ‌విట్ కు సంబంధించి ఓ ఆసక్తిక‌ర విష‌యం వైర‌ల్ అవుతోంది. డీఎంకే పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో 40 శాతం క్రిమినల్స్ ఉండగా టీవీకేలోనూ అంతేమంది ఉన్నారు. అన్నాడీఎంకేలో అయితే అఫిడవిట్ ప్రకారం ఏకంగా 69 శాతం మంది క్రిమినల్స్ ఉన్నారు.

మిగితా పార్టీలోనూ కాస్త తగ్గినా క్రిమినల్స్ మాత్రం ఉన్నారు. దీంతో డీఎంకే పార్టీలో రౌడీలు ఉన్నారని అందుకే త‌మిళ ప్ర‌జ‌లు టీవీకేకు ప‌ట్టం క‌ట్టార‌న్న ప్ర‌చారాన్ని విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. రౌడీ పార్టీల‌కు వ్య‌తిరేకంగా జెన్ జీ యువ‌త విజ‌య్ పార్టీవైపు నిల‌బ‌డ్డార‌ని టీవీకే చెప్పుకోవడం పబ్లిసిటీ కోసమేనని అంటున్నారు. జెన్‌జీ లేదు గాడిద గుడ్డు లేదు.. అంతా టీవీకే స్కామ్ అని చెబుతున్నారు. విజయ్ గత రెండేళ్లుగా పీఆర్ టీంలతో భారీగా ప్రచారం చేయించుకున్నాడని విమర్శలు వస్తున్నాయి. దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల్లో పీఆర్ టీంలతో ఆఫీసులు పెట్టుకుని ప్రచారం చేసుకున్నాడని అంటున్నారు. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story