- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీకి అన్నామలై గుడ్‌బై..? తమిళనాడులో సొంత పార్టీ దిశగా అడుగులు
తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై కమలం పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారా అంటే తాజా పరిణామాలు అందుకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు (Tamilnadu Politics) పాలిటిక్స్ రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి కె.అన్నామలై (K. Annamalai) భారతీయ జనతా పార్టీని వీడి, సొంతంగా కొత్త రాజకీయ పార్టీని స్థాపించే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. జూన్ 4న ఆయన పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో, ఆ తర్వాతే ఈ సరికొత్త పొలిటికల్ జర్నీకి శ్రీకారం చుట్టబోతున్నట్లుగా సమాచారం. అయితే, అన్నామలై నేరుగా పార్టీని ప్రకటించకుండా, ముందుగా ఓ భారీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారని.. దానికి మక్కల్ శక్తి ఇయక్కం (People's Power Movement) అనే పేరును పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. వివిధ వృత్తుల్లో ఉన్న విద్యావంతులను, సమాజంలోని విభిన్న వర్గాల యువతను ఒకే తాటిపైకి తెచ్చి, బలమైన వాలంటీర్ నెట్‌వర్క్‌ను నిర్మించడమే ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశమని అన్నామలై ఫాలోవర్స్ చర్చించుకుంటున్నారు.
హుటాహుటిన ఢిల్లీకి అన్నామలై..
అయితే, ఇటీవల కాలంలో బీజేపీ కేంద్ర నాయకత్వ నిర్ణయాలపై అన్నామలై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం (CBSE) తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ ఏడాది నుంచే 3 భాషల విధానాన్ని అమలు చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక కోయంబత్తూరు వ్యాప్తంగా అన్నామలై మద్దతుదారులు ‘మా నాయకుడా.. వచ్చి మమ్మల్ని నడిపించు’ అంటూ భారీ పోస్టర్లు వేయడం తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం అన్నామలై అత్యవసరంగా ఢిల్లీ పయనమవడం, అక్కడ అధిష్టానంతో భేటీ కానుండటంతో ఆయన తదుపరి అడుగుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.






