- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ జనసేనకు షాక్.. రేపటి హైదరాబాద్ సభకు అనుమతి నిరాకరణ
తెలంగాణ జనసేనకు బిగ్ షాక్ తగిలింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ హైదరాబాద్‌లో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’ పేరుతో సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకుంది. ..

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ జనసేన(Telangana Janasena)కు బిగ్ షాక్ తగిలింది. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(Telangana Formation Day) సందర్భంగా రాష్ట్ర జనసేన పార్టీ హైదరాబాద్‌లో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ’(Telangana Nav Nirman Sankalpa Sabha) నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో ఏపీ, తెలంగాణ మధ్య జరుగుతున్న పరిణామాలను దృష్టిలోకి తీసుకోవడంతో పాటుగా రాష్ట్ర అవతరణ నేపథ్యంలో ప్రభుత్వ కార్యక్రమాల సందర్భంగా జనసేన సభకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఆ పార్టీ నేతలు చేసిన దరఖాస్తును తిరస్కరించారు. దీంతో జనసేనకు ఎదురుదెబ్బ తగిలినట్లైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సభ నిర్వహించి తీరుతామని ప్రకటనలు చేసిన ఆ పార్టీ నేతలకు నిరాశే ఎదురైంది.
కోర్టు ద్వారా అనుమతి తెచ్చుకునే ప్రయత్నాలు
అయితే కోర్టు ద్వారా అనుమతి తీసుకునేందుకు జనసేన నేతలు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని సమాచారం. మరి ఈ పిటిషన్‌పై కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ సభ నిర్వహణపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ, పలువురు తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలా సభ నిర్వహిస్తారో చూస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జనసేన నాయకుల అడుగులు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.
పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాకే తెలంగాణలో సభ పెట్టుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్






