మావోయిస్టులకు మరో కోలుకోలేని దెబ్బ.. భద్రతా బలగాల విజయంపై అమిత్ షా హర్షం

by Malleboina Mahesh |   (  Updated:2025-12-25 09:58:56  IST  )

ఒడిశాలోని కంధమాల్ అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికేతో పాటు పలువురు కీలక సభ్యులు హతం కావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.

మావోయిస్టులకు మరో కోలుకోలేని దెబ్బ.. భద్రతా బలగాల విజయంపై అమిత్ షా హర్షం
X

దిశ, వెబ్ డెస్క్: ఒడిశాలోని కంధమాల్ అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికేతో పాటు పలువురు కీలక సభ్యులు హతం కావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన ఒడిశా పోలీసుల ఎస్ఓజీ (SOG), సీఆర్‌పీఎఫ్ (CRPF) బలగాలను షా అభినందించారు. నక్సలిజం పై జరుగుతున్న పోరాటంలో ఇది ఒక కీలకమైన మలుపని, అంకితభావంతో పని చేస్తున్న భద్రతా బలగాల పరాక్రమాన్ని చూసి దేశం గర్విస్తోందని ఆయన పేర్కొన్నారు. దశాబ్దాలుగా విద్రోహ చర్యలకు పాల్పడుతున్న కీలక నేతలను మట్టుబెట్టడం ద్వారా మావోయిస్టు వ్యవస్థకు బలమైన దెబ్బ తగిలిందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో 2026 మార్చి నాటికి భారతదేశాన్ని నక్సల్ రహితంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పానికి ఈ విజయం మరింత బలాన్ని ఇచ్చిందని అమిత్ షా తన ట్వీట్‌లో పునరుద్ఘాటించారు. హింసను వీడి మావోయిస్టులు ప్రధాన స్రవంతిలో కలవాలని, లేనిపక్షంలో విద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు. దేశంలో శాంతి, భద్రతలను కాపాడేందుకు మోడీ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేయదని, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఫలాలు అందాలంటే నక్సలిజం అంతం కావడం అత్యవసరమని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Read More..

ఒడిశాలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే హతం

Next Story