కోల్‌కతా‌కు చేరుకున్న అమిత్ షా.. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి?

by Kema Shiva Kumar |   (  Updated:2026-05-08 11:14:33  IST  )

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. కోల్‌కతాలో అమిత్ షా సమక్షంలో కాసేపట్లో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ జరగనుంది.

కోల్‌కతా‌కు చేరుకున్న అమిత్ షా.. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి?
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యేందుకు బెంగాల్ ఎన్నికల పరిశీలకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కాసేపటి క్రితం కోల్‌కతా చేరుకున్నారు. ఈ భేటీలోనే బీజేపీ శాసనసభా పక్ష నేతలను ఎన్నుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.

రేసులో ముందున్న సువేందు..

ముఖ్యమంత్రి రేసులో మాజీ ప్రతిపక్ష నేత నందిగ్రామ్‌, భవానీపూర్‌లో మాజీ సీఎం మమతా బెనర్జీపై విజయం సాధించిన సువేందు అధికారి (Suvendu Adhikari) పేరు బలంగా వినిపిస్తోంది. మరోవైపు బీజేపీ సీనియర్ నేతలు దిలీప్ ఘోష్, సమిక్ భట్టాచార్య, అగ్రిమిత్ర పాల్‌లు కూడా సీఎం సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే, అధిష్టానం సువేందునే ముఖ్యమంత్రిగా ప్రటిస్తుందా.. అనూహ్యంగా మరొకరిని తెరపైకి తెస్తుందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

బెంగాల్ సీఎంగా సువేందు అధికారి, ఇద్దరు డిప్యూటీ సీఎంలు

Next Story