బెంగాల్ సీఎంగా సువేందు అధికారి, ఇద్దరు డిప్యూటీ సీఎంలు

by Malleboina Mahesh |   (  Updated:2026-05-08 11:13:31  IST  )

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఎన్నికయ్యారు. 207 సీట్లతో ఘనవిజయం సాధించిన బీజేపీ, ఇద్దరు డిప్యూటీ సీఎంలతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. రేపు ఉదయం కోల్‌కతాలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

బెంగాల్ సీఎంగా సువేందు అధికారి, ఇద్దరు డిప్యూటీ సీఎంలు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ పార్టీ 207 స్థానాల్లో గెలిచి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తుంది. ఈ క్రమంలో ఈ రోజు జరిగిన బెంగాల్ బీజేపీ శాసనసభ పక్షనేత ఎన్నికల కార్యక్రమం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒడిశా సీఎం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి (Suvendu Adhikari)ని ఎన్నుకున్నారు. ఈ మేరకు పార్టీ సీనియర్ నేత సువేందు అధికారి పేరును భట్టాచార్య ప్రతిపాధించారు.

అలాగే తొలిసారి బెంగాల్ లో ఇద్దరు డిప్యూటీ సీఎంలకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ సమావేశంలో బెంగాల్ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. రేపు ఉదయం 11 గంటలకు కలకత్తలోని పరేడ్ గ్రౌండ్‌లో సువేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ సీఎంలతో పాటు, ఎన్డీయే కూటమిలోని సీఎంలు కీలక నేతలు హాజరుకానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కోల్‌కతా‌కు చేరుకున్న అమిత్ షా.. బెంగాల్ సీఎంగా సువేందు అధికారి?

Next Story