- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్కాజిగిరి కాలనీలో నితిన్.. ఇంత సింపుల్‌గా ఉన్నాడేంటి?
నితిన్ కొత్త సినిమా షూటింగ్ ప్రస్తుతం మల్కాజిగిరిలోని ఓ కాలనీలో శరవేగంగా జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటుడు నితిన్ ప్రస్తుతం నరి, సోము దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను మల్కాజిగిరిలోని ఓ కాలనీలో చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ సందర్భంగా తీసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నితిన్ చాలా సింపుల్ లుక్‌లో కనిపించడంతో, ఈ చిత్రంలో ఆయన మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడి పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాగే షూటింగ్ జరుగుతున్న సమయంలో కాలనీ వాసులకు చేతులు ఊపుతూ హాయ్ చెప్పడం అభిమానులను ఆకట్టుకుంది.
గత కొంతకాలంగా మాస్ కథలతో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నించిన నితిన్ ఆశించిన విజయాలను అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో సాదాసీదా యువకుడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తుండటంతో, ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయని అభిమానులతో పాటు సినీ విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా తొలుత రితిక నాయక్‌ను ఎంపిక చేసినప్పటికీ, ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో వైష్ణవి చైతన్యను తీసుకున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు.






