బ్యాక్ అందాలతో మతిపోగొడుతున్న అనసూయ.. అందాలకు ఫ్యాన్స్ ఫిదా

by Pulgam srinivas |

బ్లూ పట్టు చీరలో అనసూయ అందాల సందడి.

బ్యాక్ అందాలతో మతిపోగొడుతున్న అనసూయ.. అందాలకు ఫ్యాన్స్ ఫిదా
X

దిశ, వెబ్ డెస్క్: న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అనసూయ, ఆ తర్వాత యాంకర్‌గా విశేష గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. యాంకర్‌గా వచ్చిన క్రేజ్‌తో సినిమాల్లో అవకాశాలు అందుకున్న ఆమె, చాలా కాలం పాటు టీవీ షోలతో పాటు వెండితెరపైనా బిజీగా కొనసాగింది.




ప్రస్తుతం యాంకరింగ్‌కు దూరంగా ఉంటూ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఆమె కీలక పాత్రలో నటించిన 'నాగ బంధం' చిత్రం జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'పుష్ప' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనసూయకు ఇతర భాషల చిత్రాల్లోనూ అవకాశాలు పెరిగాయి.




సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఆమెకు భారీ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు స్టైలిష్ ఫోటోషూట్లతో అభిమానులను ఆకట్టుకునే ఈ బ్యూటీ, తాజాగా మరోసారి తన లేటెస్ట్ లుక్‌తో నెటిజన్ల దృష్టిని తనవైపు తిప్పుకుంది. తాజాగా అనసూయ బ్లూ కలర్ పట్టు చీరలో మెరిసింది.




అందుకు తగిన బ్లౌజ్‌ను జత చేస్తూ ఎలిగెంట్‌తో పాటు గ్లామరస్ లుక్‌ను సొంతం చేసుకుంది. చేతికి గాజులు, వేలికి ఉంగరం, మెడలో హారం, చిన్న ఇయర్‌రింగ్స్‌తో తన సంప్రదాయ శైలిని మరింత అందంగా మలిచింది. అందంగా ముడివేసిన జుట్టు ఆమె లుక్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చింది.




ఈ ఫోటోల్లో అనసూయ ఎంతో అందంగా, ఆకర్షణీయంగా కనిపించడంతో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Photos Courtesy: Instagram

Next Story