- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉండవల్లి ఘటన.. అంబటి రాంబాబు, పేర్ని నానిలపై అట్రాసిటీ కేసు
రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బృందం పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బృందం పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలపై తాడేపల్లి పోలీసులకు అందిన వేర్వేరు ఫిర్యాదుల మేరకు మూడు కేసులు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. పెనుమాకకు చెందిన మాణిక్యం అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని సహా వైసీపీ నాయకులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
వైసీపీ నేతల పర్యటన సమయంలో విధుల్లో పోలీస్ అధికారిని నెట్టివేసినందుకు అంబటి రాంబాబుపై సీఐ వీరేంద్రబాబు స్వయంగా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అంబటిపై పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 కింద కేసు నమోదయింది. వైసీపీ నేత నారాయణమూర్తి కారు అద్దం పగలగొట్టిన ఘటనపై ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు.. రైతులు, టీడీపీ నేతలపై కూడా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఉండవల్లిలో తలెత్తిన ఉద్రిక్తలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పర్యటన విధుల్లో ఉన్న కానిస్టేబుల్ పై దాడిచేసిన బ్యాచ్ పైనే పోలీసులకు అనుమానాలు బలపడుతున్నాయి. తొలుత కొందరు వ్యక్తులు రాళ్లదాడి చేసి.. ఉద్దేశపూర్వకంగానే రైతుల్ని రెచ్చగొట్టారన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అంతేకాక.. గతంలో టీడీపీ ఆఫీసుపై దాడిచేసిన ఘటనలో నిందితుడిగా ఉన్న చైతన్య అనే వ్యక్తి.. నిన్నటి గొడవలో వైసీపీ నేతల వెంట ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఉద్రిక్తతలకు కారణమైన వారందరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పూర్తిస్థాయి ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.






